త్వరలో థియేటర్స్ లో ‘ఒక్కడే ఒక్కడు’

సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్, రవి ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు స్వాతి రెడ్డి, డాక్టర్ రవి బాల సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ఒక్కడే ఒక్కడు ’. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ‘ఒక్కడే ఒక్కడు’ సినిమాకు CH సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘గదర్ 2’ హీరోయిన్ సిమ్రత్ కౌర్, ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, కమల్, షఫీ, శివరామరాజు వెంకట్, ధనరాజ్, రచ్చ రవి, రాకేశ్, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉంటాయని, త్వరలో ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.
ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో వెంకట్ నటిస్తున్నడు, నెగిటీవ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర అందరికి నచ్చుతుంది, డైరెక్టర్ సుధీర్ రాజ్ ఈ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు, చాలా వైడ్ అండ్ వైలెంట్ రోల్ లో వెంకట్ రోల్ అందరిని అలరిస్తుంది, నిర్మాతలు స్వాతి రెడ్డి అలాగే రవి బాల ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా నిర్మించారు.
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.